The Lion King: చైనాలో వారం ముందే విడుదలై 'జంగిల్ బుక్'ను దాటేసిన 'లయన్ కింగ్'!

  • లైవ్‌ యానిమేషన్‌ చిత్రం 'ది లయన్‌ కింగ్‌'
  • చైనాలో దుమ్ము రేపుతున్న కలెక్షన్లు
  • ఈ నెల 19న ఇండియాలో విడుదల

వాల్‌ డిస్నీ నిర్మించిన లైవ్‌ యానిమేషన్‌ చిత్రం 'ది లయన్‌ కింగ్‌' చైనాలో దుమ్ము రేపుతోంది. ఈ శుక్రవారం భారత ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ముందుగానే చైనాలో విడుదలైంది. డిస్నీ గత సినిమాలు 'జంగిల్‌ బుక్‌', 'బ్యూటీ అండ్ ది బీస్ట్' ఓపెనింగ్ రికార్డులను తిరగరాసింది. తొలి రోజు కలెక్షన్లలో 'జంగిల్ బుక్' 11.6 మిలియన్‌ డాలర్లు,  'బ్యూటీ అండ్‌ ద బీస్ట్‌' 12.4 మిలియన్‌ డాలర్లు వసూలు చేయగా, ఆ రికార్డులను బద్దలు కొట్టిన 'లయన్ కింగ్', మొదటి రోజే 14.5 మిలియన్‌ డాలర్లు వసూలుచేసిందట.

కాగా, ఈ చిత్రం యూఎస్ తో పాటు మిగతా అన్ని ప్రాంతాల్లో 19న విడుదల కానుందన్న సంగతి తెలిసిందే. తెలుగులో టాప్ నటులు ఈ సినిమాలోని పాత్రలకు డబ్బింగ్ చెప్పడంతో ఆసక్తి పెరిగింది. నాని, జగపతిబాబు, అలీ, బ్రహ్మానందం, రవిశంకర్‌, లిప్సిక తదితరులు డబ్బింగ్‌ చెప్పారు.

More Telugu News