Nidhi Agarwal: ఎక్స్ పోజింగ్ కాకుండా ఇంకేమైనా చేశావా?: ఆకతాయి ప్రశ్నకు నిధి అగర్వాల్ అదిరే సమాధానం!

  • శుక్రవారం విడుదల కానున్న 'ఇస్మార్ట్ శంకర్'
  • ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీగా నిధి
  • ట్విట్టర్ లో ఫ్యాన్స్ తో ముచ్చట్లు
నాగచైతన్య హీరోగా నటించిన 'సవ్యసాచి'తో పరిచయమై, ఆ వెంటనే 'మిస్టర్‌ మజ్ను'లో చాన్స్ దక్కించుకుని ఇప్పుడు 'ఇస్మార్ట్ శంకర్‌'తో రొమాన్స్ చేసి, ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన నిధి అగర్వాల్, ఓ ఆకతాయి వేసిన ప్రశ్నకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. ఈ వారంలో సినిమా రెడీ కానుండగా, ప్రస్తుతం ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఆమె, సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో మాట్లాడారు. ట్విట్టర్ లో ఆమె పలు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుండగా, "ఎక్స్‌ పోజింగ్ కాకుండా ఇంకేమైనా చేశావా ఈ సినిమాలో?" అన్న ప్రశ్న ఎదురైంది. దీనిపై స్పందించిన నిధి, "నిజానికి చాలా చేశాను. ట్రైలర్‌ కాదు మూవీ చూడు" అంటూ సమాధానం ఇచ్చింది. కాగా, శుక్రవారం విడుదల కానున్న 'ఇస్మార్ట్‌ శంకర్‌'లో నిధితో పాటు నభా నటేష్‌ మరో హీరోయిన్‌ గా నటించిన సంగతి తెలిసిందే.
Nidhi Agarwal
Ismart Shankar
Twitter

More Telugu News