Pruthvi: జగన్ ను కలిసిన సినీ నటుడు పృథ్వీ

  • ఎస్వీబీసీ ఛానల్ ఛైర్మన్ గా పృథ్వీ  నియామకం 
  • జగన్ నివాసానికి వచ్చి కలిసిన పృథ్వీ 
  • పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపిన నటుడు 
ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో ఈ రోజు సినీ నటుడు పృథ్వీ భేటీ అయ్యారు. అమరావతి సమీపంలోని జగన్ నివాసానికి వచ్చిన ఆయన... మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుతం వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయనను ఎస్వీబీసీ ఛానల్ ఛైర్మన్ గా నియమిస్తూ జగన్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జగన్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

జగన్ జరిపిన పాదయాత్రలో ఓసారి పృథ్వీ కూడా ఆయనతో పాటు నడిచారు. ఓ చేత్తో వైసీపీ జెండాను పట్టుకుని, మరో చేత్తో జగన్ చేతిని పట్టుకుని ఆయన నడుస్తున్న ఫొటోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
Pruthvi
Jagan
YSRCP
SVBC Channel

More Telugu News