Andhra Pradesh: జస్ట్ మరో 10 రోజులే.. తాడేపల్లికి వెళ్లిపోనున్న వైసీపీ ప్రధాన కార్యాలయం!

  • ప్రకటించిన వైసీపీ నేత విజయసాయిరెడ్డి
  • అన్ని నియామకాలు అక్కడినుంచే సాగుతాయని వెల్లడి
  • మున్సిపల్ ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తామని ధీమా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి పూర్తిస్థాయిలో తాడేపల్లికి తరలించబోతున్నట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో ఈరోజు వైసీపీ ప్రధాన కార్యాలయం పనులను ఆయన పర్యవేక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..‘మరో 10 రోజుల్లో వైసీపీ ప్రధాన కార్యాలయం తాడేపల్లిలో అందుబాటులోకి వస్తుంది.

ఇకపై పార్టీ కార్యకలాపాలన్నీ ఇక్కడి నుంచే జరుగుతాయి. ప్రభుత్వ విధానాలు, పార్టీకి సంబంధించిన నియామకాలను తాడేపల్లి నుంచే చేపడతాం’ అని చెప్పారు. త్వరలో ఏపీలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయదుందుభి మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి పరిపాలన అందించడం, నవరత్నాల ద్వారా ప్రతీపౌరుడికి లబ్ధిచేకూర్చే దిశగా వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుకు వెళుతోందని స్పష్టం చేశారు.
Andhra Pradesh
YSRCP
head quarters
10 days
Vijay Sai Reddy
tadepalli

More Telugu News