MS Dhoni: ధోనీపై తీవ్ర విమర్శలు చేసిన యువరాజ్ సింగ్ తండ్రి

  • జడేజాను ధాటిగా ఆడమని చెప్పి అవుట్ చేశాడు
  • స్పిన్నర్లను ఎదుర్కోవాలని పాండ్యాకు చెప్పాడు
  • ధోనీ ముందే అవుటైనా ఫలితంలో మార్పు ఉండేది కాదు
టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీపై మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ తీవ్ర విమర్శలు చేశాడు. ప్రపంచకప్ సెమీఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో భారత జట్టు ఓటమికి ధోనీయే కారణమని నిందించాడు. చివరి ఓవర్లలో నెమ్మదిగా ఆడుతూ రవీంద్ర జడేజాపై ఒత్తిడి తీసుకొచ్చాడని ఫలితంగా భారీ షాట్‌కు యత్నించి జడేజా అవుటయ్యాడని అన్నాడు.

జడేజా భారీ షాట్లు ఆడుతుంటే ధోనీ నెమ్మదిగా ఆడాడని విమర్శించాడు. రవీంద్ర జడేజా 77 పరుగుల వద్ద ఉన్నప్పుడు ధాటిగా ఆడమని చెప్పి అతడి అవుట్‌‌కు కారణమయ్యాడని, స్పిన్నర్లపై దాడి చేయాలంటూ పాండ్యాకు చెప్పాడని యోగ్‌రాజ్ చెప్పుకొచ్చాడు. ఇప్పటికే చాలా క్రికెట్ ఆడేసిన ధోనీకి ఎలా ఆడాలో ఆ మాత్రం కూడా తెలియకపోవడం బాధాకరమన్నాడు.

యువరాజ్ సింగ్ ఎప్పుడూ ధోనీలా ఇతర ఆటగాళ్లకు ఇలా ఆడాలి, అలా ఆడాలి అని చెప్పలేదన్నాడు. మంచి బంతులు పడినప్పుడు కూడా ధోనీ సిక్సర్లు కొట్టడంలో విఫలమయ్యాడని, అతడు ముందే అవుటైనా ఫలితంలో పెద్ద తేడా ఉండేదని కాదని యోగ్‌రాజ్ విరుచుకుపడ్డాడు.
MS Dhoni
Yuvraj Singh
yograj singh
world cup

More Telugu News