Suicide bomber: ఆఫ్ఘన్ లో పెళ్లి వేడుకపై బాలుడి ఆత్మాహుతి దాడి..ఐదుగురి మృతి!

  • తనను తాను పేల్చేసుకున్న బాలుడు
  • 40 మందికి తీవ్ర గాయాలు
  • చనిపోయింది పదిమంది అంటున్న స్థానికులు
ఆఫ్ఘనిస్థాన్‌లోని నంగర్‌హార్ ప్రావిన్స్‌లో జరిగిన ఆత్మాహుతి దాడి అందరినీ విస్మయపరుస్తోంది. ఓ పెళ్లి వేడుకలో 13 ఏళ్ల బాలుడు తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. పచెర్‌గామ్ జిల్లాలోని ప్రభుత్వ అనుకూల మిలీషియా కమాండర్ అయిన మాలిక్ తూర్ ఆధ్వర్యంలో పెళ్లి జరుగుతుండగా ఈ దారుణం జరిగింది.

ఆత్మాహుతి దాడిలో తూర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఈ ఘటనలో ఐదుగురే చనిపోయారని నంగర్‌హార్ గవర్నర్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. అయితే, స్థానికులు మాత్రం పదిమంది చనిపోయారని చెబుతున్నారు. కాగా, గత నెలలో ఉత్తర ఆఫ్ఘనిస్థాన్‌‌లో 26 మంది ప్రభుత్వ అనుకూల మిలీషియా సభ్యులను తాలిబన్లు హతమార్చారు. కాగా, తాజా ఆత్మాహుతి దాడిపై ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు.
Suicide bomber
wedding party
Afghanistan

More Telugu News