Shraddha Kapoor: ఫొటోగ్రాఫర్ తో శ్రద్ధా కపూర్ పెళ్లి వార్తలు.. తండ్రి శక్తికపూర్ స్పందన!

  • నా కూతురు పెళ్లి చేసుకోబోతోందా?
  • నన్ను ఆహ్వానించడం మర్చిపోవద్దు
  • పెళ్లి ఎక్కడ జరుగుతుందో చెబితే.. నేనూ వస్తా
సెలెబ్రిటీ ఫొటోగ్రాఫర్ రోహన్ శ్రేష్టను బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ పెళ్లాడబోతోందనే వార్తలు బీటౌన్ లో చక్కర్లు కొడుతున్నాయి. రెండేళ్లుగా వారిద్దరూ డేటింగ్ చేస్తున్నారని బాలీవుడ్ కు చెందిన వెబ్ సైట్లలో వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది వీరిద్దరూ ఒక ఇంటివారు కాబోతున్నారని కథనాలు వెలువడుతున్నాయి.

ఈ విషయంపై ఆమె తండ్రి, సీనియర్ నటుడు శక్తి కపూర్ ను ఐఏఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీ ప్రశ్నించగా... 'నా కూతురు పెళ్లి చేసుకోబోతోందా? పెళ్లికి నన్ను కూడా ఆహ్వానించడం మర్చిపోవద్దు' అంటూ చలోక్తులు విసిరారు. పెళ్లి ఎక్కడ జరుగుతుందో చెబితే, తాను కూడా వస్తానని చెప్పారు. తాను శ్రద్ధాకు తండ్రి అయినప్పటికీ... తనకు ఇంత వరకు ఈ పెళ్లి విషయం తెలియదని అన్నారు. మీకేమైనా తెలిస్తే తనకు తప్పకుండా చెప్పాలని చమత్కరించారు.

'సాహో' చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ నటిస్తోంది. దీనికి తోడు 'స్ట్రీట్ డ్యాన్సర్' చిత్రంలో వరుణ్ ధావన్ జోడీగా నటిస్తోంది. టైగర్ ష్రాఫ్ హీరోగా తెరకెక్కనున్న 'బాఘీ 3' చిత్రానికి కూడా సంతకం చేసింది.
Shraddha Kapoor
Rohan Shrestha
Marriage
Bollywood
Shakti Kapoor

More Telugu News