Andhra Pradesh: 'నవరత్నాల బడ్జెట్'కు జగన్ కేబినెట్ ఆమోదం

  • మరికాసేపట్లో అసెంబ్లీ ముందుకు బడ్జెట్
  • జగన్ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం
  • వ్యవసాయ బడ్జెట్ ను సమర్పించనున్న మోపిదేవి
2019-20 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ కు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ కొద్దిసేపటి క్రితం ఆమోదం పలికింది. మరికాసేపట్లో బడ్జెట్ ప్రతిపాదనలు అసెంబ్లీ ముందుకు రానున్న నేపథ్యంలో, ఈ ఉదయం సచివాలయానికి వచ్చిన జగన్, తన మంత్రివర్గ సహచరులతో సమావేశమై, కొత్త బడ్జెట్ కు ఆమోదం పలికారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన నవరత్నాల అమలుపైనే ఈ బడ్జెట్ ప్రధానంగా ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. కాగా, బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అసెంబ్లీలో సమర్పించనున్నారు. ఆపై వ్యవసాయ బడ్జెట్ ను మరో మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రవేశపెడతారు.
Andhra Pradesh
Budget
Jagan
Cabinet

More Telugu News