Telangana: కీచక ప్రొఫెసర్ దొరికాడు.. బాసర ట్రిపుల్ ఐటీ ప్రొఫెసర్ రవికి బేడీలు

  • హైదరాబాద్‌లోని బంధువుల ఇంట్లో ఉండగా అరెస్ట్
  • పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారంలో అదుపులో మరో ఇద్దరు
  • రూ.3.70 లక్షల నగదు, కారు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం

బాసరలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ట్రిపుల్‌ ఐటీ)లో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన కీచక అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ రవి వరాల ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. పరారీలో ఉన్న రవి కోసం హైదరాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌లలో గాలింపు చేపట్టిన పోలీసులు హైదరాబాద్‌లోని బంధువుల ఇంట్లో తలదాచుకున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారంలో రవితోపాటు నిందితులుగా వున్న ట్రిపుల్ ఐటీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా బాసర పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ శశిధర్ రాజు మాట్లాడుతూ.. విద్యార్థినులను వేధించిన రవిపై నిర్భయ, పోక్సో, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారంలో మోర్గే విశ్వనాథ్‌, మేనేజ్‌మెంట్‌ విభాగంలో అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్‌గా పనిచేస్తున్న మాధావేది సుధాకర్‌లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుల నుంచి రూ.3.70 లక్షల నగదు, కారు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ వివరించారు.

More Telugu News