Donald Trump: ట్రంప్ 'హృదయ మూత్రపిండం' వ్యాఖ్యలు వైరల్!

  • అమెరికాలో నూతన కిడ్నీ వ్యాధుల విధానం
  • కిడ్నీకి హృదయంలో ప్రత్యేకస్థానం ఉందన్న ట్రంప్
  • నవ్వుకుంటున్న నెటిజన్లు

అగ్రరాజ్యం అమెరికాకు అధ్యక్షుడన్న మాటే కానీ, కొన్నిసార్లు కమెడియన్ కు ఏమాత్రం తీసిపోని రీతిలో వ్యవహరించడం డొనాల్డ్ ట్రంప్ కే చెల్లుతుంది. అంతర్జాతీయ సమావేశాల్లో సైతం ప్రోటోకాల్ ను పక్కనబెట్టేస్తారు. మొన్నటికిమొన్న ఓ సమావేశంలో సౌదీ యువరాజును ఆటపట్టించారు. కుర్చీలో కూర్చున్న మహ్మద్ బిన్ సల్మాన్ ను వెనకనుంచి తట్టి ఎవరో చెప్పుకో చూద్దాం అనే తరహాలో నవ్వులు పూయించారు. తాజాగా, ఓ కామెంట్ తో మరోసారి కామెడీ చేశారు.

అమెరికా వ్యాప్తంగా కిడ్నీ వ్యాధులకు సంబంధించి కొత్త విధానాన్ని ప్రకటిస్తూ, కిడ్నీకి హృదయంలో ప్రత్యేక స్థానం ఉందంటూ వ్యాఖ్యానించారు. నిజంగా అదో అద్భుతం అన్నారు. కిడ్నీకి ఆరోగ్యపరంగా ఉన్న ప్రాధాన్యతను చెప్పేందుకు ఆయన అలా పేర్కొన్నా, నెటిజన్లు మాత్రం దాన్నో చమత్కారభరితమైన వ్యాఖ్యగా చూస్తున్నారు. సంపూర్ణేశ్ బాబు 'హృదయ కాలేయం' సినిమా బంపర్ హిట్టయిన తరహాలో, నెటిజన్ల చలవతో ట్రంప్ గారి 'హృదయ మూత్రపిండం' కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

More Telugu News