Kaleswaram: ఆ టైంలో తమరు గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నారేమో: జగన్‌పై లోకేశ్ ధ్వజం

  • ఎంతో సంస్కారవంతమైన భాషలో అడిగారు
  • పత్రికల్లో వచ్చిన వార్తలు చూడవచ్చు
  • ఇలాంటివి చూసే టైం ఉండి ఉండదు
నేడు ఏపీ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో అధికార, విపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు జోరుగా కొనసాగాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం జగన్ వెళ్లడాన్ని ప్రతిపక్ష నేత చంద్రబాబు తప్పుబట్టారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని, అప్పుడు చంద్రబాబు గాడిదలు కాశారా? అంటూ జగన్ ఎద్దేవా చేశారు. దీనిపై మాజీ మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా జగన్‌పై విమర్శలు గుప్పించారు.

‘‘కాళేశ్వరం కడుతుంటే చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా ? అని వైఎస్ జగన్ గారు ఎంతో సంస్కారవంతమైన భాషలో ఈ రోజు అసెంబ్లీలో అడిగారు. ఇది జూన్ 21, 2018న మీ అవినీతి 'సాక్షి'లో వచ్చిన వార్త(వార్తను షేర్ చేశారు). అలాగే మిగతా పత్రికల్లో వచ్చిన వార్తలు కూడా చూడవచ్చు. కాళేశ్వరంపై అప్పుడు చంద్రబాబు కేంద్రానికి ఫిర్యాదు చేసిన వార్త పేపర్లలో వచ్చింది. ఆ టైంలో తమరు గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్నారేమో, ఇలాంటివి చూసే టైం ఉండి ఉండదు’’ అంటూ లోకేశ్ ఎద్దేవా చేశారు.
Kaleswaram
Chandrababu
Jagan
Assembly
Nara Lokesh
Twitter

More Telugu News