Adivi srinivas: ఉత్కంఠను రేపుతోన్న 'ఎవరు' ఫస్టులుక్

  • వెంకట్ రాంజీ దర్శకత్వంలో 'ఎవరు'
  • కీలకమైన పాత్రలో నవీన్ చంద్ర
  •  వచ్చేనెల 23వ తేదీన విడుదల 
అడివి శేష్ కథానాయకుడిగా వెంకట్ రాంజీ దర్శకత్వంలో 'ఎవరు' నిర్మితమైంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ నుంచి రీసెంట్ గా ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు. తాజాగా ఫస్టులుక్ ను వదిలారు. రక్తం అంటిన చేత్తో రెజీనా పగిలిన అద్దం ముక్క పట్టుకొని ఉండగా, ఆమెకి ఎదురుగా అడివి శేష్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. ఈ లుక్ ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

సస్పెన్స్ తో కొనసాగే కథలతో ఆశ్చర్యచకితులను చేయడం .. ఆకట్టుకోవడం అడివి శేష్ కి అలవాటే. అదే తరహాలో ఇప్పుడు ఆయన 'ఎవరు' సినిమా చేశాడు. నవీన్ చంద్ర కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమా ఆగస్టు 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీచరణ్ పాకాల సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు. 
Adivi srinivas

More Telugu News