Andhra Pradesh: టీడీపీ నేతలు జగన్ ను అసెంబ్లీ సాక్షిగా పాతిపెడతాం అన్నారు అధ్యక్షా.. ఆరోజు చర్యలు తీసుకోలేదేం?: బుగ్గన

  • కరవు, రుతుపవనాలపై అసెంబ్లీలో చర్చ సాగుతోంది
  • ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయాలనుకుంటే పోలీసులు ఉన్నారు
  • ఏపీ అసెంబ్లీలో కరవుపై చర్చ సందర్భంగా బుగ్గన రాజేంద్రనాథ్

అసెంబ్లీలో కరవుపై, రుతుపవనాలు రాకపోవడంపై చర్చ జరుగుతోందనీ, ఎమ్మెల్యేలకు కేటాయించే నిధుల్లో భాగంగా ప్రతిపక్ష నేత చంద్రబాబుకు కూడా రూ.కోటి ఇస్తామని సీఎం జగన్ హుందాగా చెప్పారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. ఎక్కడో ఎమ్మెల్యేను అడ్డుకుంటే చట్టాలు ఉన్నాయనీ, పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ‘ఒకటి అడుగుతా అధ్యక్షా.. ఇదే నిండు సభలో మా నాయకుడు ప్రతిపక్ష నేతగా ఉండగా ఆయన్ను పాతిపెడతామన్నారు కదా అధ్యక్షా..

మరి ఆ రోజు చర్యలు లేవే అధ్యక్షా? మనం అడుగుతా ఉండేది ఏమీ? మంచి హుందాగా ప్రతిపక్షానికి కూడా అవకాశం ఇస్తాం. మీరు ధన్యవాదాలు, అభినందనలు తెలిపితే బాగుంటుంది అని చెప్పాం అధ్యక్షా’ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామిని ప్రకాశం జిల్లాలో రైతు సదస్సుకు హాజరుకాకుండా వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News