Andhra Pradesh: పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ కార్యకర్తపై దాడి.. తీవ్రంగా స్పందించిన నారా లోకేశ్!

  • వైసీపీ కార్యకర్తలు టీడీపీ సర్పంచ్ పై దాడిచేశారు
  • ఈ దాడుల్ని ఖండించేందుకు సీఎంకు మనసు రావట్లేదా?
  • లేక జగన్ కార్యకర్తలను అదుపుచేయలేని అసమర్థతతో ఉన్నారా?
  • ట్విట్టర్ లో విమర్శలు గుప్పించిన టీడీపీ ఎమ్మెల్సీ
ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా కాళ్లకూరు గ్రామ సర్పంచ్ అడ్డాల శివరామరాజుపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్ ఆరోపించారు. ఈ దాడులను ఖండించడానికి సీఎం జగన్ కు మనసు రావడం లేదా? అని ప్రశ్నించారు. లేక సీఎం జగన్ తమ కార్యకర్తలను అదుపు చేయలేని అసమర్థతతో ఉన్నారా? అని నిలదీశారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదనీ, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని నారా లోకేశ్ ఏపీ సీఎం జగన్ ను హెచ్చరించారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన లోకేశ్ దాడికి గురైన శివరామరాజు ఫొటోలను తన ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేశారు.
Andhra Pradesh
West Godavari District
Telugudesam
Nara Lokesh
Jagan
Chief Minister
YSRCP
Telugudesam sarpanch attacked

More Telugu News