GST Council: పెట్రోలియం ఉత్పాదనలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చేదే లేదు: కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం

  • విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం
  • జీఎస్టీ కౌన్సిల్ ఫిర్యాదేమీ చేయలేదని వ్యాఖ్య
  • సుంకాన్ని విధించే అధికారం రాష్ట్రాలకు ఉందని వెల్లడి

పెట్రోలియం ఉత్పాదనలను జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావాలన్న ప్రతిపాదనలను కేంద్రం తోసిపుచ్చింది. నేడు రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర పెట్రోలియం శాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ లిఖిత పూర్వక జవాబిచ్చారు. దీనిలో భాగంగా జీఎస్టీ పరిధిలోకి పెట్రోలియం ఉత్పాదనలను తీసుకువచ్చే ప్రతిపాదనేది లేదని తేల్చి చెప్పారు.

ఈ అంశంపై అధ్యయనానికి టాస్క్‌పోర్స్ ఏర్పాటుకు జీఎస్టీ కౌన్సిల్ ఫిర్యాదేమీ చేయలేదని రెవెన్యూ శాఖ తెలిపినట్టు ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. రాజ్యాంగంలోని 7వ ఆర్టికల్‌లో పొందుపరిచిన జాబితాలో పెట్రోలియం క్రూడ్‌తో పాటు విమానాలకు వినియోగించే ఇంధనం, గ్యాస్, హై స్పీడ్ డీజిల్, మోటర్ స్పిరిట్‌పై సుంకాన్ని విధించే అధికారం రాష్ట్రాలకు ఉందని మంత్రి తెలిపారు.

More Telugu News