Andhra Pradesh: శ్వేతపత్రాల విడుదలను స్వాగతిస్తున్నాం.. అప్పుడు-ఇప్పుడు ప్రభుత్వ అధికారులు ఒక్కరే!: చంద్రబాబు

  • ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటుందో చూస్తాం
  • అది చూశాకే తుది నిర్ణయం తీసుకుంటాం
  • అమరావతిలో మీడియాతో చంద్రబాబు ఇష్టాగోష్ఠి 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రిత్వశాఖల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేస్తామని ప్రకటించడాన్ని స్వాగతిస్తామని టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శ్వేతపత్రాల ద్వారా అసలు ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటుందో చూద్దామని వ్యాఖ్యానించారు. అమరావతిలో ఈరోజు చంద్రబాబు మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.

టీడీపీ హయాంలో, వైసీపీ హయాంలోనూ ప్రభుత్వ అధికారులు అయితే ఒక్కరేనని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం శ్వేతపత్రాల్లో ఏం చెబుతుందో చూశాకే తాము స్పందిస్తామని టీడీపీ అధినేత స్పష్టం చేశారు. టీడీపీ పాలన అద్భుతంగా ఉన్నందుకే కేంద్రం నుంచి అవార్డులు వచ్చాయని చంద్రబాబు గుర్తుచేశారు.

More Telugu News