Andhra Pradesh: మా ప్రభుత్వం ప్రతిపక్షం మైక్ కట్ చేయదు: మంత్రి అనిల్ కుమార్

  • గతంలో బీఏసీ సమావేశంలో మాకు మాట్లాడే అవకాశం లేదు
  • ఇప్పుడు బీఏసీ సమావేశం జరిగిన తీరు వేరు
  • అచ్చెన్నాయుడు పశ్చాత్తాపం చెంది ఉంటారు
గత ప్రభుత్వం సమస్యలపై చర్చలను పట్టించుకున్న దాఖలాలు లేవని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. ఏపీ శాసనసభ కార్యకలాపాల సలహామండలి (బీఏసీ) సమావేశంలో అనిల్ కుమార్ పాల్గొన్నారు. సమావేశం అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, గతంలో బీఏసీ సమావేశంలో తమకు మాట్లాడే అవకాశం లేదని అన్నారు. ఇప్పుడు బీఏసీ సమావేశం జరిగిన తీరు చూసి తామెంతో తప్పు చేశామని ప్రతిపక్ష నేత అచ్చెన్నాయుడు పశ్చాత్తాపపడి ఉంటారని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం మాదిరి తమ ప్రభుత్వం ప్రతిపక్షం మైక్ కట్ చేయదని స్పష్టం చేశారు.
Andhra Pradesh
BAC
Minister
Anilkumar
Yadav

More Telugu News