Maharashtra: మూడు పులుల మరణం వెనుక దాగున్న మిస్టరీ ఇది!

  • రైతు దూడపై దాడి చేసి చంపిన కుక్కలు
  • వాటిని చంపేందుకు దూడ మృతదేహంపై విషం చల్లిన రైతు
  • దాన్ని తినే పులులు మరణించాయని తేల్చిన అధికారులు

మహారాష్ట్రలోని చిమూర్‌ అటవీ క్షేత్రంలో సోమవారం వెలుగులోకి వచ్చిన మూడు పులుల మృతి వెనకున్న మిస్టరీ వీడింది. ఓ రైతు ఆవు దూడ కళేబరంపై విషం చల్లడం, దాన్ని పులులు తినడమే వాటి మృతికి దారి తీసిందని అటవీ శాఖ అధికారులు తేల్చారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, మెటెపార్‌ గ్రామంలోని పాండురంగ  అనే రైతుకు చెందిన ఆవు దూడను, కొన్ని కుక్కలు కలిసి దాడిచేసి చంపాయి.

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అతను, ఆ కుక్కలు మళ్లీ వస్తాయని భావించి, దూడ మృతదేహంపై విషం పోశాడు. ఈ గ్రామం అభయారణ్యానికి దగ్గరగా ఉండటంతో, ఓ పులి తన రెండు కూనలతో కలిసి ఆహారం కోసం వెతుకుతూ వచ్చి, దూడ కళేబరాన్ని చూసింది. అప్పటికే ఆకలితో ఉన్న అవి దూడను తినగా, విష ప్రభావంతో ఆ మూడూ చనిపోయాయి. పులుల మృతి వార్త తీవ్ర కలకలం రేపగా, రంగంలోకి దిగిన అధికారులు, విచారణ జరిపి విషం చల్లిన రైతుపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు.

More Telugu News