Telangana: నేడు విద్యాసంస్థల బంద్.. పిలుపునిచ్చిన విద్యార్థి జేఏసీ

  • ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలి
  • కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజు దోపిడీని అరికట్టాలి
  • విద్యార్థి సంఘాల ఐక్య వేదిక డిమాండ్
ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్రించడంతోపాటు, ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలన్న డిమాండ్‌తో నేడు విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ విద్యార్థి సంఘాల ఐక్య వేదిక ప్రకటించింది. సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, పీడీఎస్‌యూ, ఏఐడీఎస్వో, టీవీవీలు తదితర సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు నిరసన ప్రదర్శన నిర్వహించాయి. బంద్ నేపథ్యంలో నగరంలోని పలు పాఠశాలలు, కాలేజీలు నేడు సెలవు ప్రకటించాయి.
Telangana
schools
Colleges
Bandh
student jac

More Telugu News