Vijayawada: గవర్నర్ నరసింహన్ ను కలిసిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

  • తిరుమల పవిత్రతను మరింత సుసంపన్నం చేయాలి
  • భక్తులకు తక్కువ సమయంలోనే దర్శనం కల్గించాలి
  • వైవీ సుబ్బారెడ్డికి సూచించిన గవర్నర్ 
విజయవాడలో గవర్నర్ నరసింహన్ ను తిరుమల, తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి  మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ కు తిరుమల శ్రీవేంకటేశ్వరుడి చిత్ర పటాన్ని బహూకరించి, శాలువాతో సత్కరించారు. తిరుమల పవిత్రతను మరింత సుసంపన్నం చేసేందుకు కృషి చేయాలని, భక్తులకు తక్కువ సమయంలోనే స్వామి వారి దర్శనం కలిగేలా చూడాలని వైవీ సుబ్బారెడ్డికి గవర్నర్ సూచించినట్టు సమాచారం.

టీటీడీలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్నామని గవర్నర్ కు వైవీ సుబ్బారెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. కాలుష్యం తగ్గించేందుకు విద్యుత్ వాహనాలు తీసుకొస్తామని, తిరుమలలో రద్దీని తగ్గించేందుకు కొండకిందే వసతి ఏర్పాటు చేస్తామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారని సమాచారం.
Vijayawada
Governor
TTD
YV Subba reddy

More Telugu News