Andhra Pradesh: ఏపీకి ఇచ్చిన మాటను మోదీ నిలబెట్టుకోలేదు: వైసీపీ ఎంపీ మార్గాని భరత్

  • కేంద్ర బడ్జెట్ పై లోక్ సభలో చర్చ
  • ఈ బడ్జెట్ లో ఏపీని కేంద్రం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది
  • ఏపీని కేంద్రం ఆదుకోవాలి
కేంద్ర బడ్జెట్ పై లోక్ సభలో జరిగిన చర్చలో ఏపీకి చెందిన ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ, ఈ బడ్జెట్ లో ఏపీని కేంద్రం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై ఇచ్చిన మాటను మోదీ నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. నిధులు లేక ఇబ్బంది పడుతున్న ఏపీని కేంద్రం ఆదుకోవాలని, రావాల్సిన బకాయిలను తక్షణం విడుదల చేయాలని, పునర్విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Andhra Pradesh
Loksabha
mp
Bharath
YSRCP

More Telugu News