Guntur District: వైసీపీ ఎమ్మెల్యేపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. కేసు నమోదు!

  • పొన్నూరు వైసీపీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య
  • ‘టిక్ టాక్’ ద్వారా ఆయనపై అభ్యంతరకర వ్యాఖ్యలు
  • చేబ్రోలు పోలీసులకు వైసీపీ నేతల ఫిర్యాదు
గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ నేతలపై సామాజిక మాధ్యమాల ఆధారంగా అభ్యంతరకర వ్యాఖ్యలు కొనసాగుతున్నాయి. ఏపీ హోం శాఖ మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరితపై ఇటీవల ‘ఫేస్ బుక్’ వేదికగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా, పొన్నూరు వైసీపీ ఎమ్మెల్యే కిలారి రోశయ్యపై ఓ వ్యక్తి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. ‘టిక్ టాక్’ యాప్ ద్వారా సుబాని అనే వ్యక్తి ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో చేబ్రోలు పోలీసులకు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Guntur District
ponnur
mla
kilari rosaiah
tiktok

More Telugu News