సీఎం జగన్ మాట తప్పారు.. ఐఆర్ విషయంలో ఉద్యోగులు దిగ్భ్రాంతికి గురయ్యారు!: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు
- ఐఆర్ ను ఈ నెల నుంచి అమలుచేస్తామనడం అన్యాయం
- దీనివల్ల ఏప్రిల్-జూలై మధ్య రిటైరయ్యేవారు నష్టపోతారు
- అమరావతిలో మీడియాతో టీడీపీ నేత
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు వేతన సవరణను కోరుకున్నారనీ, మధ్యంతర భృతిని కాదని స్పష్టం చేశారు. సీఎం జగన్ నిర్ణయంతో ఈ ఏడాది ఏప్రిల్-జూలై నెలల మధ్య పదవీవిరమణ చేసినవారికి తీవ్ర అన్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు. ఇక ఇంటర్ విద్యార్థులకు టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దుచేయడాన్ని కూడా అశోక్ బాబు తప్పుపట్టారు.