Andhra Pradesh: సీఎం జగన్ మాట తప్పారు.. ఐఆర్ విషయంలో ఉద్యోగులు దిగ్భ్రాంతికి గురయ్యారు!: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు

  • ఐఆర్ ను ఈ నెల నుంచి అమలుచేస్తామనడం అన్యాయం
  • దీనివల్ల ఏప్రిల్-జూలై మధ్య రిటైరయ్యేవారు నష్టపోతారు
  • అమరావతిలో మీడియాతో టీడీపీ నేత

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు విరుచుకుపడ్డారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి(ఐఆర్) విషయంలో సీఎం జగన్ మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 1వ తేదీ నుంచి మాత్రమే ఐఆర్ ఇస్తామని సీఎం చెప్పడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయం ఉద్యోగులను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో అశోక్ బాబు మాట్లాడారు.

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు వేతన సవరణను కోరుకున్నారనీ, మధ్యంతర భృతిని కాదని స్పష్టం చేశారు.  సీఎం జగన్ నిర్ణయంతో ఈ ఏడాది ఏప్రిల్-జూలై నెలల మధ్య పదవీవిరమణ చేసినవారికి తీవ్ర అన్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు. ఇక ఇంటర్ విద్యార్థులకు టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దుచేయడాన్ని కూడా అశోక్ బాబు తప్పుపట్టారు.

More Telugu News