S.P.charan: నా బలం నాన్న .. నా బలహీనత అమ్మ: ఎస్.పి. చరణ్

  • నాన్నంటే భయం .. గౌరవం 
  • నాన్న దగ్గర నాకు మొహమాటం
  • అమ్మతో చనువు ఎక్కువ  
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో తనకి సంబంధించిన అనేక విషయాలను ఎస్.పి.చరణ్ పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ .. "నా బలం మా నాన్న .. ఆయన నాకు ఎంత బలాన్నిస్తారనేది నేను మాటల్లో చెప్పలేను. నాన్న వున్నారంటే .. అన్నీ బాగానే ఉంటాయి అనే కొండంత ధైర్యం నాకు. ఆయనంటే భయం .. గౌరవం రెండూ వున్నాయి.

చాలా విషయాలు నేను నాన్న వరకూ తీసుకెళ్లడానికీ, ఆయనతో చెప్పడానికి మొహమాట పడుతుంటాను. కానీ నాకు ఏం కావాలనేది ఆయన గమనిస్తూనే వుంటారు. తన వైపు నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుంటారు. ఇక అమ్మ నా బలహీనత అనడంలో సందేహం లేదు. చిన్నప్పటి నుంచి నేను అమ్మ కూచినే. అమ్మ చుట్టూనే తిరుగుతూ ఉండేవాడిని కనుక, ఆమెతో నాకు చనువు ఎక్కువ. ఆమెతో అన్ని విషయాలను చెప్పుకునేవాడిని. అమ్మకి చెప్పకుండా .. ఆమెను కాదని ఏమీ చేసేవాడిని కాదు" అని చెప్పుకొచ్చాడు.
S.P.charan
Ali
Balu

More Telugu News