Andhra Pradesh: అనంతపురం నారాయణ కాలేజీలో విద్యార్థిని చితక్కొట్టిన అధ్యాపకులు.. రణరంగంగా మారిన క్యాంపస్!

  • అనంతపురం పట్టణంలో ఘటన
  • ఓ విద్యార్థిపై దాడిచేసిన అధ్యాపకులు
  • విద్యార్థులకు మద్దతుగా వచ్చిన విద్యార్థి సంఘాల నేతలు
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలో నారాయణ కాలేజీ అధ్యాపకులు రెచ్చిపోయారు. ఓ విద్యార్థిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. దీంతో తిరగబడ్డ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కాలేజీ ఏజీఎం, ప్రిన్సిపాల్ లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు కాలేజీలోకి దూసుకొచ్చేందుకు ప్రయత్నించగా, అధ్యాపకులు అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. విద్యార్థిపై దాడిచేసిన అధ్యాపకులను తొలగించేవరకూ వెనక్కి తగ్గబోమని ఈ సందర్భంగా తోటి విద్యార్థులు స్పష్టం చేశారు. కాగా, అసలు అధ్యాపకులు విద్యార్థిని ఎందుకు కొట్టారు? దాడిచేసిన అధ్యాపకులు ఎవరు? అనే విషయమై వివరాలు తెలియాల్సివుంది. 
Andhra Pradesh
Anantapur District
Narayana college
faculty attcked student
student attacked
Police

More Telugu News