Andhra Pradesh: చంద్రబాబు భద్రత కుదింపు పిటిషన్.. విచారణను రేపటికి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు!

  • టీడీపీ అధినేతకు భద్రతను కుదించిన ప్రభుత్వం
  • ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు
  • తన భద్రతను పునరుద్ధరించాలని న్యాయస్థానానికి వినతి
తన భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ ను ఏపీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. 2004-14 మధ్యకాలంలో ఏపీ ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకు ఓ ఏఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారి సీఎస్ఓలుగా ఉండేవారు. వీరి కింద ముగ్గురు ఆర్ఐలు, ఆర్ఐల పరిధిలో ఓ హెడ్ కానిస్టేబుల్, నలుగురు కానిస్టేబుళ్లు ఉండేవారు.

ప్రస్తుతం ఓ డీఎస్పీతో పాటు నలుగురు కానిస్టేబుళ్లను మాత్రమే భద్రత కోసం కేటాయించినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే చంద్రబాబుకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ భద్రతే కల్పించామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ గతంలోనే స్పష్టం చేశారు.
Andhra Pradesh
Chandrababu
Telugudesam
Security
High Court
Petition

More Telugu News