India: మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏమిటి?.. బెంబేలెత్తిపోతున్న న్యూజిలాండ్!

  • ఇండియా-న్యూజిలాండ్ సెమీస్ కు వర్షం ముప్పు
  • ఈరోజు ఆట ఆగితే... ఆగిన చోట నుంచి రేపు మళ్లీ కొనసాగనున్న మ్యాచ్
  • రేపు కూడా వర్షం కురిసే అవకాశం

ప్రపంచకప్ లో భాగంగా నేడు టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య ఓల్డ్ ట్రాఫోర్డ్ లో తొలి సెమీఫైనల్స్ జరగనుంది. లీగ్ దశలో అన్ని విభాగాల్లో సత్తా చాటిన టీమిండియా... కివీస్ పై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉంది. మ్యాచ్ ను వరుణుడు అడ్డుకునే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ ప్రకటన న్యూజిలాండ్ ను బెంబేలెత్తిస్తోంది.

ఒకవేళ మ్యాచ్ ప్రారంభమైన తర్వాత వర్షం కురిస్తే... ఆట ఆగిపోతే... మ్యాచ్ ఎక్కడ ఆగిపోయిందో, మరుసటి రోజు మళ్లీ అక్కడి నుంచే ప్రారంభిస్తారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... రేపు కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో, న్యూజిలాండ్ శిబిరంలో కలవరం మొదలైంది. ఎందుకంటే... వరుసగా రెండు రోజులు వర్షం వల్ల ఆట కొనసాగకపోతే... టీమిండియాను విజేతగా ప్రకటిస్తారు.

లీగ్ దశలో 8 మ్యాచుల్లో టీమిండియా 7 మ్యాచుల్లో గెలిచింది. ఒక మ్యాచ్ (న్యూజిలాండ్ తో జరిగింది) వర్షం వల్ల రద్దైంది. దీంతో, 15 పాయింట్లతో టాప్ ప్లేస్ లో ఇండియా ఉంది. న్యూజిలాండ్ 11 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. దీంతో, లీగ్ దశలో అత్యధిక పాయింట్లు ఉన్న ఇండియాను విజేతగా ప్రకటిస్తారు. మరోవైపు, ఈ మ్యాచ్ లో టాస్ కీలకం కానుందని విశ్లేషకులు చెబుతున్నారు.

More Telugu News