Hyderabad: శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఒక్కసారే 150 కిలోలకు పైగా బంగారం పట్టివేత

  • విమానాశ్రయం కార్గో విభాగంలో భారీగా బంగారం
  • కస్టమ్స్ అధికారుల దాడులు
  • మలేషియా నుంచి వచ్చినట్టుగా గుర్తించిన అధికారులు
శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం అక్రమరవాణా ఘటనలు ఎన్నో చోటుచేసుకున్నాయి. అయితే, తాజా సంఘటన వాటన్నింటిని మించినదని చెప్పాలి. ఇవాళ అధికారుల తనిఖీల్లో భారీగా బంగారం పట్టుబడింది. కస్టమ్స్ అధికారులు శంషాబాద్ ఎయిర్ పోర్టులోని కార్గో విభాగం నుంచి 150 కిలోలకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మలేషియా నుంచి హైదరాబాద్ కు అక్రమంగా బంగారం తరలిస్తున్నట్టు గుర్తించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుమతి లేని ఓ ఏజెన్సీ ఈ అక్రమరవాణాకు సూత్రధారి అని తెలుస్తోంది.
Hyderabad
Shamshabad
Airport
Gold

More Telugu News