ShivaKrishna: అప్పట్లో వున్న ఆప్యాయతలు ఇప్పుడు లేవు: నటుడు శివకృష్ణ

షార్ట్స్‌లో చూడండి
తెలుగు తెరపై విభిన్నమైన పాత్రల ద్వారా మెప్పించిన నటుల జాబితాలో శివకృష్ణ కూడా కనిపిస్తారు. తాను హీరోగా చేయడమే కాకుండా, అగ్రహీరోలందరి సినిమాల్లోను ఆయన నటించారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, "తెలుగు చిత్రపరిశ్రమ చెన్నైలో వున్నప్పటి పరిస్థితులు వేరు .. హైదరాబాద్ కి వచ్చేసిన తరువాత వున్న పరిస్థితులు వేరు" అన్నారు.

"చెన్నైలో చిత్రపరిశ్రమ వున్న కాలాన్ని స్వర్ణయుగమనే అనుకోవాలి. అందరం కలిసి ఎంతో అభిమానంతో ఉండేవాళ్లం .. ఆప్యాయంగా పలకరించుకునే వాళ్లం .. మనసు విప్పి మాట్లాడుకునే వాళ్లం. చిత్రపరిశ్రమ హైదరాబాద్ వచ్చాక .. ఏ ఆర్టిస్ట్ ఎక్కడ వుంటున్నది .. మరో ఆర్టిస్ట్ కి తెలియదు. మాములుగా కలుసుకునే అవకాశమే లేదు .. షూటింగులో కలుసుకున్నా ప్రేమతో కూడిన పలకరింపులే లేవు. అంతా మారిపోయింది .. ఈ విషయంలో ఎవరినీ తప్పుపట్టడానికి లేదు" అని చెప్పుకొచ్చారు. 
Go Back to Shorts
ShivaKrishna

More Telugu News