Ramcharan: 'ఆల్వేస్ రామ్ చరణ్'... ఇన్ స్టాగ్రామ్ లో ఖాతా తెరిచిన రామ్ చరణ్

  • కొద్దిసేపట్లోనే వేలమంది ఫాలోవర్లు
  • కేవలం ప్రొఫైల్ పిక్ పోస్టు చేసిన రామ్ చరణ్
  • వెరిఫై చేసిన ఇన్ స్టాగ్రామ్
సినీ తారలకు సోషల్ మీడియాతో ఎంతో అవసరం ఉంటుంది. తమ సినీ విశేషాలను భారీస్థాయిలో ప్రచారం చేసుకునేందుకు సామాజిక మాధ్యమాన్ని మించిన సాధనం లేదు. అందుకే చాలామంది అగ్రతారలు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో క్రియాశీలకంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. తాజాగా, టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్ కూడా ఇన్ స్టాగ్రామ్ లో అడుగుపెట్టారు. రామ్ చరణ్ ఇన్ స్టాగ్రామ్ లో ఆల్వేస్ రామ్ చరణ్ అంటూ ఖాతా తెరిచారు. దాంట్లో ఇప్పటివరకు తన ప్రొఫైల్ పిక్ ను మాత్రం పోస్టు చేశారు. ఆయన ఖాతా ప్రారంభించిన కొద్దిసేపట్లోనే 16.7 వేలమందికి పైగా అనుసరించడం మొదలుపెట్టారు. ఇన్ స్టాగ్రామ్ కూడా ఆ అకౌంట్ ను వెరిఫై చేయడంతో అది నిజంగా రామ్ చరణ్ అకౌంటేనని అర్థమవుతోంది.
Ramcharan
Instagram
Tollywood

More Telugu News