Karnataka: రాజ్యసభలో మద్దతు పెంచుకునేందుకు బీజేపీ కుట్ర: మాజీ సీఎం సిద్ధరామయ్య

  • కర్ణాటకలో ముదురుతున్న రాజకీయ సంక్షోభం
  • ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభపెడుతోంది
  • అమిత్ షా డైరెక్షన్ లో కుట్రలు
కర్ణాటకలో రాజకీయ సంక్షోభం ముదురుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య స్పందించారు. బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. రాజ్యసభలో మద్దతు పెంచుకునేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా డైరెక్షన్ లో కుట్రలు సాగుతున్నాయని ఆరోపించారు. ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభపెడుతోందని, సీబీఐ, ఐటీ దాడులు జరుగుతాయని ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. తమకు 120 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, రెబల్ ఎమ్మెల్యేలకు నచ్చచెబుతామని సిద్ధరామయ్య అన్నారు.
Karnataka
Ex cm
siddharamaiha
congress

More Telugu News