sensex: కొనసాగుతున్న బడ్జెట్ ప్రభావం.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

  • స్టాక్ మార్కెట్లపై కేంద్ర బడ్జెట్ ప్రభావం
  • 792 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 252 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కుప్పకూలాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ లో చేసిన ప్రతిపాదనలు ఇన్వెస్టర్లపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. లిస్టెడ్ కంపెనీల్లో కనీస పబ్లిక్ షేర్ హోల్డింగ్ ను 25 శాతం నుంచి 35 శాతానికి పెంచుతున్నట్టు ఆమె ప్రకటించారు. షేర్ల బైబ్యాక్ లపై 20 శాతం పన్ను విధిస్తున్నట్టు తెలిపారు. ఫారిన్ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు, సంపన్నులపై పన్ను భారాన్ని మరింత పెంచుతున్నట్టు ప్రకటించారు. ఈ ప్రతిపాదనలన్నీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 792 పాయింట్లు పతనమై 38,720కి పడిపోయింది. నిఫ్టీ 252 పాయింట్లు కోల్పోయి 11,558కి దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యస్ బ్యాంక్ (5.56%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.94%), టీసీఎస్ (0.67%).

టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-8.18%), ఓఎన్జీసీ (-5.43%), హీరో మోటో కార్ప్ (-5.31%), మారుతి సుజుకి (-5.21%), ఎన్టీపీసీ (-4.98%).        

More Telugu News