world cup: రేపటి మ్యాచ్ లో టాస్ కీలకం: టీమిండియా కెప్టెన్ కోహ్లీ

  • భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రేపు సెమీ ఫైనల్
  • న్యూజిలాండ్ బలమైన టీమ్
  • ఈ జట్టుకు బౌలింగే ప్రధాన బలం
ప్రపంచకప్ లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మద్య రేపు సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రఫోర్డ్ క్రికెట్ స్టేడియం వేదికగా ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ, న్యూజిలాండ్ జట్టు బలమైన టీమ్ అని, ఈ జట్టుకు బౌలింగే ప్రధాన బలమని అన్నాడు. రేపటి మ్యాచ్ లో టాస్ కీలకమని, సెమీస్ కు చేరడంతో టీమ్ కొంత ప్రశాంతంగా ఉందని చెప్పాడు. వ్యక్తిగత రికార్డులకు ప్రాధాన్యమివ్వనని చెప్పిన కోహ్లీ, భారత జట్టులో రోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడని అన్నాడు.
world cup
India
newzealand
kohli

More Telugu News