Amaravathi: ఫార్ములా వన్ రేసింగ్ లో అమరావతి జట్టు విజయంపై నారా లోకేశ్ ఆనందం

  • హెచ్2ఓ పవర్ బోట్ రేసింగ్ లో అమరావతికి అగ్రస్థానం
  • అమరావతి డ్రయివర్ జోనాస్ ఆండర్సన్ అద్భుత ప్రదర్శన
  • ట్వీట్ చేసిన లోకేశ్
గత ప్రభుత్వ హయాంలో ఏపీ రాజధాని అమరావతి వద్ద అంతర్జాతీయ పవర్ బోట్ రేసింగ్ పోటీలను అత్యంత ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫార్ములా వన్ కేటగిరీలో నిర్వహించిన ఈ పోటీలకు ప్రపంచ పేరెన్నికగన్న జట్లతో పాటు తొలిసారి అమరావతి టీమ్ కూడా పాల్గొంది. అయితే ఫైనల్స్ లో సాంకేతిక కారణాలతో అమరావతి రేసర్ జోనాస్ ఆండర్సన్ బోట్ ఆగిపోయింది. దాంతో రేసును పూర్తిచేయలేకపోయాడు.

అయితే, ఇప్పుడదే అమరావతి జట్టు ఫ్రాన్స్ లో నిర్వహించిన ఫార్ములా వన్ హెచ్2ఓ బోట్ రేసింగ్ గ్రాండ్ ప్రీలో అగ్రస్థానంలో నిలిచింది. దీనిపై నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. అమరావతి జట్టు సభ్యులు అద్భుత ప్రతిభ చూపించారని కొనియాడారు. ముఖ్యంగా, జోనాస్ ఆండర్సన్ కళ్లు చెదిరే ప్రదర్శనతో టాప్ లో నిలవడం సంతోషం కలిగిస్తోందన్నారు. బహుమతి ప్రదానోత్సవంలో భారత జాతీయగీతం వినిపిస్తుండడం రోమాలు నిక్కబొడుచుకునేలా చేసిందని లోకేశ్ ట్వీట్ చేశారు.
Amaravathi
Nara Lokesh
Jonas
F1

More Telugu News