'రాజుగారి గది 3'లో అవికా గోర్

Mon, Jul 08, 2019, 02:18 PM
  • ఓంకార్ నుంచి 'రాజుగారి గది 3'
  • రెగ్యులర్ షూటింగుకి సన్నాహాలు
  • త్వరలోనే మిగతా వివరాలు   
తెలుగులో వచ్చిన హారర్ థ్రిల్లర్ సినిమాల్లో 'రాజుగారి గది' ఒకటి. ఆ సినిమా సీక్వెల్ గా 'రాజుగారి గది 2' చేయగా, అది అంతగా ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాకి సీక్వెల్ గా 'రాజుగారి గది 3' చేయడానికి దర్శకుడు ఓంకార్ రంగంలోకి దిగాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగుకి ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నాడు.

ఈ సినిమా నుంచి తమన్నా తప్పుకోవడంతో, తాప్సీని తీసుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా అవికా గోర్ పేరు తెరపైకి వచ్చింది. తెలుగులో వరుస విజయాలను అందుకున్న అవికా గోర్, ఆ తరువాత గ్యాప్ తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే 'రాజుగారి గది 3'లో అవికాను ప్రధాన పాత్రకోసం తీసుకున్నారా? లేదంటే కీలకమైన మరో పాత్ర కోసం ఎంపిక చేసుకున్నారా? అనేది తెలియాల్సి వుంది. 
Tags: Avika Gor
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad