cudupha: ఇడుపులపాయలో తండ్రి వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద సీఎం జగన్‌ నివాళి

  • కుటుంబ సభ్యులతో కలిసి ఘాట్‌కు చేరుకున్న జగన్‌
  • వైఎస్‌ విగ్రహం వద్ద నివాళుల అనంతరం ప్రత్యేక ప్రార్థనలు
  • తర్వాత ఇడుపులపాయలో పర్యటించనున్న వైసీపీ అధినేత
  మాజీ ముఖ్యమంత్రి దివంగత వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని ఆయన తనయుడు, ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఈరోజు కడప జిల్లా ఇడుపులపాయలోని తండ్రి ఘాట్‌ను సందర్శించారు. తల్లి విజయమ్మ, సోదరి షర్మిల, ఇతర కుటుంబ సభ్యులతోపాటు ఘాట్‌కు చేరుకున్న జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం తండ్రి సమాధిపై పూలమాలలు ఉంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఘాట్‌ వద్దకు భారీగా చేరుకున్న అభిమానులకు అభివాదం చేశారు. ప్రార్థనల అనంతరం జగన్‌ ఇడుపులపాయలో పర్యటించనున్నారు. గండి ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకుని ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. 
cudupha
idupulapaya
YSR ghat
Jagan

More Telugu News