Gujarat: ఆవుదూడను చంపిన వ్యక్తికి పదేళ్ల జైలు శిక్ష.. రాజ్‌కోట్ కోర్టు సంచలన తీర్పు

  • ఆవుదూడను అపహరించి వధించిన సలీం
  • కుమార్తె వివాహ వేడుకలో మాంసం వడ్డింపు
  • జైలు శిక్షతోపాటు లక్ష రూపాయల జరిమానా

ఆవుదూడను వధించిన గుజరాత్ వ్యక్తి సలీమ్ మక్రానీకి కోర్టు పదేళ్ల జైలు శిక్షతోపాటు లక్ష రూపాయల జరిమానా విధించింది. గుజరాత్ యానిమల్ ప్రెజెర్వేషన్ (అమెండమెంట్) చట్టం, 2017 ప్రకారం రాజ్‌కోట్‌లోని అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి హెచ్‌కే దవే ఈ తీర్పు వెలువరించారు.

సలీంపై ఈ ఏడాది జనవరిలో కేసు నమోదైంది. తనకు చెందిన ఓ ఆవుదూడను అపహరించి, వధించాడన్న సత్తార్ కొలియా ఫిర్యాదుపై సలీమ్ పై అభియోగాలు నమోదయ్యాయి. ఆవుదూడ మాంసాన్ని అతడి కుమార్తె వివాహంలో మక్రానీ వడ్డించాడు. ఈ కేసులో సాక్ష్యాలను పరిశీలించిన తర్వాత కోర్టు అతడిని దోషిగా నిర్ధారించింది. అనంతరం పదేళ్ల జైలు శిక్షతోపాటు లక్షరూపాయల జరిమానా విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది.

More Telugu News