Oh! Baby: ‘ఓ బేబీ’లో సమంత నటన ‘ఇన్ క్రెడిబుల్’.. నాగార్జున ప్రశంసలు

  • ‘ఓ బేబీ’ చిత్రం చాలా బాగుంది..దర్శకత్వంపై ప్రశంసలు
  • సీనియర్ నటి లక్ష్మి నటన అద్భుతం
  • ఈ చిత్రంలో నటీనటులందరూ బాగా నటించారు
హిట్ టాక్ సంపాదించుకున్న ‘ఓ బేబీ’ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకులు, సమంత అభిమానులు, సినీ ప్రముఖులు ప్రశంసించారు. తాజాగా, ప్రముఖ నటుడు నాగార్జున స్పందించారు. ‘ఓ బేబీ’ చిత్రం చాలా బాగుందని, సీనియర్ నటి లక్ష్మి నటన అద్భుతమని కొనియాడారు. నటులు రాజేంద్రప్రసాద్, రావూ రమేశ్ తో పాటు ఈ చిత్రంలో నటించిన నటీనటుల నటన బాగుందని అన్నారు. ఈ సందర్భంగా సమంత నటన గురించి నాగార్జున చెబుతూ, ‘ఇన్ క్రెడిబుల్’ అని, అలాగే, నందినీరెడ్డి దర్శకత్వాన్ని మెచ్చుకున్నారు.
Oh! Baby
movi
Artist
Samantha
Nagarjuna

More Telugu News