Uttar Pradesh: జైలు నుంచి తప్పించుకున్నా రైలు నుంచి తప్పించుకోలేకపోయాడు!

  • హత్యకేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు
  • తప్పించుకునేందుకు పక్కా ప్లాన్
  • విధి వక్రించి ఒకరి మృతి

ఉత్తరప్రదేశ్ లో ఇద్దరు ఖైదీలు జైలు నుంచి తప్పించుకోగా, వారిలో ఓ ఖైదీ అనూహ్యంగా మృతి చెందాడు. ఇటావా జిల్లా జైలులో రమానంద్, చంద్ర ప్రకాశ్ అనే ఇద్దరు ఖైదీలు హత్యకేసుల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఇద్దరికీ వేర్వేరు కేసుల్లో జీవితఖైదు పడింది. అయితే జైలు నుంచి తప్పించుకోవాలని ఇద్దరూ పక్కాగా స్కెచ్ వేశారు. ఎక్కడ సెక్యూరిటీ బలహీనంగా ఉంటుందో గమనించి ఆవైపుగా గోడదూకి పారిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం తమ ప్లాన్ అమలులో పెట్టారు. అయితే, ఇద్దరిలో ముందుగా చంద్ర ప్రకాశ్ గోడదూకి పరారయ్యాడు. ఆ గోడపక్కగా రైల్వే ట్రాక్ ఉంది. ఆ తర్వాత రమానంద్ గోడదూకగా, అదే సమయంలో రైలు వేగంగా దూసుకువచ్చింది. దాంతో రమానంద్ తప్పించుకునే వీల్లేక ప్రాణాలు వదిలాడు. పరారైన మరో ఖైదీ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.

  • Loading...

More Telugu News