Andhra Pradesh: ప్రజల గొంతు నొక్కాలని చూస్తే.. విప్లవానికి నాంది పలుకుతుంది: నారా లోకేశ్

  • ప్రభుత్వాన్ని ఎండగట్టిన కార్తీక్ పై కేసులు పెడతారా?
  • వేధింపుల పాలు చేస్తారా?
  • కార్తీక్ కు మేము అండగా ఉంటాం
ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వం తీరులో ఉన్న లోపాల గురించి టీడీపీ కార్యకర్త కార్తీక్ గరికపాటి ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో, కార్తీక్ పై కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత నారా లోకేశ్ స్పందిస్తూ వరుస ట్వీట్లు చేశారు. ప్రజల గొంతు నొక్కాలని చూస్తే అది విప్లవానికి నాంది పలుకుతుందని వైఎస్ జగన్ ని హెచ్చరించారు. ఒక సామాన్యపౌరుడు అయిన కార్తీక్ జగన్ ప్రభుత్వాన్ని ఎండగడుతుంటే అతన్ని కేసుల పేరుతో వేధింపులకు గురి చేస్తారా? అని ప్రశ్నించారు. కార్తీక్ కు తామంతా అండగా ఉంటామని, ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళితే అక్కడి వరకు అతని వెన్నంటే ఉంటామని స్పష్టం చేశారు. అతనికి అన్నివిధాల సాయం అందించే బాధ్యత తానే స్వయంగా తీసుకుంటానని లోకేశ్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
Andhra Pradesh
Telugudesam
karthik garikapati
nara

More Telugu News