Andhra Pradesh: చంద్రబాబుకు ఇల్లు కొనుక్కునే స్తోమత లేదా? ఇంటి స్థలం నేను ఇస్తాను: మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే సెటైర్లు

  • గెస్ట్ హౌస్ నుంచి చంద్రబాబు బయటకు రావాలి
  • లేదంటే సీఆర్డీఏ చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది
  • ఎంతటి వారైనా సరే, వదిలిపెట్టే ప్రసక్తే లేదు

ఉండవల్లి కరకట్టపై ఉన్న అక్రమనిర్మాణాలను కూల్చివేసే ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ కరకట్టపై ఉన్న లింగమనేని గెస్ట్ హౌస్ లో చంద్రబాబు నివాసాన్ని తొలగించాలని సీఆర్డీఏ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) స్పందిస్తూ, ఈ గెస్ట్ హౌస్ నుంచి చంద్రబాబు వెంటనే బయటకు రావాలని, లేదంటే సీఆర్డీఏ  చట్టపరంగా చర్యలు తీసుకుంటుందని అన్నారు. చంద్రబాబు ఐదేళ్లుగా దోచిన సంపదను ఆ ఇంట్లోనే ఏమన్నా దాచిపెట్టారా? ఈ ఇంటిని చంద్రబాబుకు బలవంతంగా లింగమనేని ఇస్తే, ఆ విషయాన్ని ఆయన చెప్పాలని వ్యాఖ్యానించారు. ఎంతటి వారైనా సరే, అక్రమనిర్మాణాలు ఉంటే చర్యలు తీసుకుంటామని, వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. చంద్రబాబుకు ఇల్లు కొనుక్కొనే స్తోమత లేకపోతే, ఇంటి నిర్మాణానికి కావాల్సిన స్థలాన్ని తాను ఇస్తానంటూ సెటైర్లు విసిరారు.

  • Loading...

More Telugu News