Telugudesam: టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ.. కత్తులతో దాడి

  • చిత్తూరు జిల్లా కృష్ణాపురంలో నిన్న రాత్రి ఘర్షణ
  • దాడుల్లో గాయపడ్డ రెండు పార్టీల వర్గీయులు
  • గ్రామంలో మోహరించిన పోలీసులు
ఎన్నికల తర్వాత ఏపీలోని పలు ప్రాంతాల్లో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం కృష్ణాపురంలో నిన్న రాత్రి ఇరు పార్టీల వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఘర్షణ కాస్తా తీవ్ర రూపం దాల్చి, కత్తులతో దాడి చేసుకునేంత వరకు వెళ్లింది. ఈ దాడుల్లో టీడీపీ కార్యకర్తలు సూజన్, మురళి, రాజులకు తీవ్ర గాయాలయ్యాయి. టీడీపీ వర్గీయులు చేసిన ప్రతిదాడుల్లో పలువురు వైసీపీ వర్గీయులు గాయపడ్డారు. గాయాలపాలైన ఇరు వర్గాల వారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో... పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు.
Telugudesam
YSRCP
Chittoor District
Krishnapuram

More Telugu News