Andhra Pradesh: ఆరో తరగతి విద్యార్థిపై ప్రభుత్వ ఉపాధ్యాయురాలి ప్రతాపం.. విరిగిన మణికట్టు

  • సీటు కోసం గొడవపడిన విద్యార్థులు 
  • కర్రతో బలంగా కొట్టిన టీచర్
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థి తండ్రి
సీటు కోసం తరగతి గదిలో కొట్టుకున్న విద్యార్థులను మందలించే క్రమంలో ఓ ఉపాధ్యాయుడు చేసిన పనికి విద్యార్థి మణికట్టు విరిగింది. గుంటూరులోని పులిపాక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న షేక్‌ మహమ్మద్‌ సోహెద్, జావీద్ అనే విద్యార్థులు శుక్రవారం మధ్యాహ్నం బెంచీపై సీటు కోసం గొడవ పడి కొట్టుకున్నారు.

గమనించిన ఉపాధ్యాయురాలు ఇద్దరినీ తీసుకెళ్లి ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేశారు. ఆయన ఇద్దరినీ మందలించి క్లాసు రూముకు పంపించారు. అయితే, తరగతి గదికి వచ్చిన తర్వాత ఉపాధ్యాయురాలు ఇద్దరినీ మరోమారు మందలించారు. ఈ క్రమంలో సోహెద్‌ను కర్రతో కొట్టడంతో అతడి మణికట్టు విరిగింది. వెంటనే విద్యార్థిని ఆసుపత్రికి తరలించి చేతికి కట్టు కట్టించారు. సోహెద్ తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  
Andhra Pradesh
Guntur District
Pulipaka school
student

More Telugu News