India: రోహిత్ దూకుడు, రాహుల్ నిలకడ... టీమిండియా సెంచరీ

  • టీమిండియా టార్గెట్ 265 రన్స్
  • ప్రస్తుతం 22 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 120 పరుగులు
  • రోహిత్ అర్ధసెంచరీ
లీడ్స్ లోని హెడింగ్లే మైదానంలో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా లక్ష్యఛేదనలో దూసుకుపోతోంది. 265 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్ కు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ శుభారంభం అందించారు. వీరిద్దరూ 18.1 ఓవర్లలో 100 పరుగులతో సెంచరీ భాగస్వామ్యం నమోదుచేశారు. ఓవైపు ఫామ్ లో ఉన్న రోహిత్ శర్మ దూకుడుగా ఆడుతూ లంక బౌలింగ్ పై ఎదురుదాడికి దిగగా, మరో ఎండ్ లో రాహుల్ నిలకడ మంత్రం జపిస్తున్నాడు. ప్రస్తుతం 22 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు వికెట్ నష్టపోకుండా 120 పరుగులు. విజయానికి ఇంకా 28 ఓవర్లలో 145 పరుగులు చేయాలి. రోహిత్ శర్మ 74, రాహుల్ 45 పరుగులతో ఆడుతున్నారు.
India
Sri Lanka
World Cup

More Telugu News