Gulabo sitabo: ‘గులాబో సితాబో’ సినిమా కోసం అమితాబ్ కష్టాలు.. రోజూ మూడు గంటల మేకప్!

  • దర్శకుడు సుజిత్ సర్కార్  చిత్రం ‘గులాబో సితాబో’
  • ప్రధాన పాత్రలో నటిస్తున్న అమితాబ్  
  • వృద్ధుడి పాత్ర గెటప్ కోసం గంటల పాటు మేకప్
దర్శకుడు సుజిత్ సర్కార్ రూపొందిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘గులాబో సితాబో’. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్న అమితాబ్ బచ్చన్ వృద్ధుడి పాత్ర గెటప్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. పాత్ర నిమిత్తం వదులు చొక్కా, తలచుట్టూ వస్త్రం, నెరిసిన గుబురు గడ్డం, కళ్లజోడు ధరించిన అమితాబ్ బచ్చన్ ప్రచార చిత్రం ఎంతో ఆశ్చర్యకరంగా ఉంది. ఈ లుక్ కోసం తనకు ఎన్ని గంటలపాటు మేకప్ చేశారన్న ఆసక్తికర విషయాన్ని అమితాబ్ ప్రస్తావించారు. ప్రతిరోజూ మూడు గంటల సమయం పట్టేదని, మేకప్ అంతా పూర్తయిన తర్వాత తన పరిస్థితి ఇదీ అంటూ తన గెటప్ కు సంబంధించిన ఫొటోను, మేకప్ రూమ్ లో తీసిన మరో ఫొటోను అమితాబ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 
Gulabo sitabo
sujit sarkar
Amitabh Bachchan

More Telugu News