Cbi: సీబీఐ అదనపు డైరెక్టర్ మన్నెం నాగేశ్వరరావు బదిలీ

  • అగ్నిమాపక శాఖ, సివిల్ డిఫెన్స్ అండ్ హోం గార్డు విభాగ డైరెక్టర్ జనరల్ గా నియామకం
  • ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు 
  • వరంగల్ జిల్లాలోని మంగపేట మన్నెం స్వస్థలం

సీబీఐలో అదనపు డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న మన్నెం నాగేశ్వరరావును ఆ శాఖ నుంచి బదిలీ చేశారు. అగ్నిమాపక శాఖ, సివిల్ డిఫెన్స్ అండ్ హోం గార్డు విభాగానికి ఆయనను డైరెక్టర్ జనరల్ గా నియమించారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, వరంగల్ జిల్లాలోని మంగపేట మన్నెం నాగేశ్వరరావు స్వస్థలం. సీబీఐ డైరెక్టర్, ప్రత్యేక డైరెక్టర్ అలోక్ వర్మ, రాకేష్ ఆస్థానాల మధ్య వివాదం నెలకొన్న సమయంలో ఆ విభాగానికి తాత్కాలిక డైరెక్టర్ గా మన్నెం నాగేశ్వరరావుని నియమించారు.

  • Loading...

More Telugu News