Artist: విజయనిర్మల సంతాప సభలో కూలిన టెంట్.. తప్పిన ప్రమాదం

  • హైదరాబాద్ లో విజయనిర్మల దశదిన కర్మ
  • హాజరైన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు
  •  అతిథులు చేరుకోకముందే కూలిన టెంట్ 

ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. హైదరాబాద్, గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షనల్ సెంటర్ లో విజయనిర్మల దశదినకర్మ కార్యక్రమం, సంతాప సభ ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు హాజరయ్యారు. అయితే, ఈ కార్యక్రమంలో చిన్న అపశ్రుతి చోటుచేసుకుంది. అతిథుల కోసం ఏర్పాటు చేసిన టెంట్ ఒక్కసారిగా కూలిపోయింది. అయితే, అతిథులు అక్కడికి చేరుకోకముందే ఈ ఘటన జరగడంతో ప్రమాదం తప్పింది.
  

More Telugu News