TANA: వాషింగ్టన్‌లో ఘనంగా ప్రారంభమైన తానా మహాసభలు

  • జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన మహాసభలు
  • ముఖ్య అతిథిగా కపిల్ దేవ్
  • ఆకట్టుకున్న చిన్నారుల నృత్యరూపకం

వాషింగ్టన్‌ లో గురువారం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 22వ మహాసభలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. టీమిండియా క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమాన్ని తానా అధ్యక్షుడు సతీశ్ వేమన-నీలిమ దంపతులు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. తొలిరోజు ‘ఎక్స్‌లెన్స్ ఇన్ లీడర్‌షిప్’ అనే అంశంపై కపిల్‌దేవ్ మాట్లాడగా, రెండో రోజైన శుక్రవారం 150 మంది చిన్నారులు ప్రదర్శించిన నృత్యరూపకం ఆహూతులను ఆకట్టుకుంది. అంతకుముందు వాషింగ్టన్ వీధుల్లో మేళతాళాలతో పరేడ్ నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖ సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎంపీలు సీఎం రమేశ్, లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు మల్లు భట్టి విక్రమార్క, పువ్వాడ అజయ్‌కుమార్‌, విశ్వంజీ, పరిపూర్ణానంద స్వామీజీ తదితరులు పాల్గొన్నారు.

More Telugu News