Gold: బడ్జెట్ ప్రకటన తర్వాత బంగారం ధర ఇదీ!

  • బంగారంపై ఎక్సైజ్ డ్యూటీ పెంచిన కేంద్రం
  • ఒక్కరోజే బంగారం ధర రూ.590 పెంపు
  • 10 గ్రాముల బంగారం ధర రూ.34,800

లోక్ సభలో కేంద్ర ఆర్థికమంతి నిర్మలా సీతారామన్ ప్రధాన బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత దేశ ఆర్థికస్థితిలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా, బంగారం ధరకు రెక్కలొచ్చాయి. అందుకు కారణం ఉంది. బంగారం, ఇతర విలువైన లోహాలపై కస్టమ్స్ సుంకాన్ని 10 నుంచి 12.5 శాతానికి పెంచుతున్నట్టు బడ్జెట్ లో పేర్కొనడంతో బంగారం ధర పెరిగింది. ఒక్కరోజే రూ.590 మేర పెరుగుదల చోటుచేసుకుంది. బడ్జెట్ అనంతరం 10 గ్రాముల బంగారం ధర రూ.34,800 వద్ద ట్రేడవుతోంది. ఇక, కిలో వెండి రూ.38,500 ధర పలుకుతోంది.

More Telugu News